మంగళవారం 27 అక్టోబర్ 2020
Business - Sep 30, 2020 , 03:28:30

ఎల్‌ఐసీలో 25% వాటా విక్రయం!

ఎల్‌ఐసీలో 25% వాటా విక్రయం!

  • దశలవారీగా విక్రయించే యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ: కరోనాతో ఖాళీ అయిన ఖజానాను నింపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. బంగారు బాతుగా ఉన్న బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో వాటా విక్రయానికి సన్నద్దమవుతున్నది. దశలవారీగా సంస్థలో 25 శాతం వాటా విక్రయించేయోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోవడం, ద్రవ్యలోటు 3.5 శాతానికి చేరుకోవడం కేంద్రాన్ని కలవరానికి గురి చేస్తున్నది. దీంతో ఈ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించడానికి సిద్ధమవుతున్నది. దశలవారీగా ఎల్‌ఐసీలో 25 శాతం వాటా విక్రయ ప్రతిపాదనకు క్యాబినెట్‌ అనుమతి తీసుకోబోతున్నది. మార్కెట్‌ పరిస్థితులు కుదటపడిన తర్వాతే వాటాలు విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు నిరాకరించాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.2.1 లక్షల కోట్ల నిధులను సేకరించాలని భావించినప్పటికీ ఆ లక్ష్యానికి కరోనా గండికొట్టింది. దీంతో ఇప్పటివరకు కేవలం 5,700 కోట్లు మాత్రమే సేకరించింది. logo