శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Dec 17, 2020 , 23:37:09

బిట్‌కాయిన్‌@ 23 వేల డాలర్లు

బిట్‌కాయిన్‌@ 23 వేల డాలర్లు

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్‌ మరో రికార్డును సృష్టించింది. గురువారం 23 వేల డాలర్లు దాటి చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. ఒక్క రోజుల్లోనే ఏకంగా 3 వేల డాలర్లు ఎగబాకడం విశేషం. బుధవారం 20 వేల డాలర్ల స్థాయిలో ఉన్న విలువ.. ఆ మరుసటి రోజే 3 వేల డాలర్లు పెరిగి 23,770 డాలర్లు పలికింది. అత్యధిక రిటర్నులు పంచుతున్న ఈ క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయడానికి  అతిపెద్ద పెట్టుబడిదారులు, కంపెనీలు ఆసక్తి చూపడంతో గడిచిన వారం రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది.  ఒక దశలో 1,500 డాలర్ల స్థాయికి పడిపోయిన విలువ ప్రస్తుతం 22 వేల డాలర్లు ఎగబాకింది. గడిచిన ఏడాదికాలంలో బిట్‌కాయిన్‌ 250 శాతం బలపడింది.   


VIDEOS

logo