Hero Passion Plus | దేశంలోనే పేరొందిన టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్.. తాజాగా మార్కెట్లోకి నూతన అవతార్‌లో `పాషన్ ప్లస్ (Hero Passion Plus)` తీసుకొచ్చింది. 100సీసీ సెగ్మెంట్లో రూపుదిద్దుకున్న హీరో పాషన్ ప్లస్ (Hero Passion Plus)’ .. 2020లో బీఎస్-6 ప్రమాణాలను అందుకోలేకపోతున్నదంటూ దాదాపు మూడేండ్లుగా నిలిపేసింది. తాజాగా రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ‘పాషన్ ప్లస్ (Hero Passion Plus)’ ఇంజిన్ అప్ డేట్ చేసింది. ఈ బైక్ ఈ-20 పెట్రోల్ సాయంతోనూ నడుస్తుంది. న్యూ హీరో పాషన్ (Hero Passion Plus) బైక్ ధర రూ.75,131గా నిర్ణయించారు.
పాత హీరో పాషన్ ప్లస్ ((Hero Passion Plus) బైక్‌లో ఎటువంటి మార్పుల్లేకపోయినా బాడీ ప్యానెల్స్ కొన్ని కొత్త గ్రాఫిక్స్ పొందాయి. తాజా పాషన్ ప్లస్ (Hero Passion Plus) మూడు రంగుల్లో (షేడ్స్ స్పోర్ట్స్ రెడ్, బ్లాక్ నెక్సాస్ బ్లూ, బ్లాక్ హెవీ గ్రే) అందుబాటులో ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యుయల్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జార్బర్స్ @ ది రేర్, డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఐబీఎస్ ఫీచర్లు వస్తాయి. హీరో పాషన్ ప్లస్ (Hero Passion Plus) బైక్ ఇంజిన్ 97.2 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్, 4-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో నడుస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7.9 బీహెచ్పీ విద్యుత్, 8.05 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
ఒక లీటర్ పెట్రోల్ పై 60కి పైగా కి.మీ. దూరం ప్రయాణించవచ్చునని తెలుస్తున్నది. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో హీరో పాషన్ ప్లస్ (Hero Passion Plus) కాసింత కాస్ట్ లీ కానున్నది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ)కి చెందిన హోండా షైన్ 100 బైక్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు హీరో మోటో కార్ప్.. పాషన్ ప్లస్ బైక్ తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది.