శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 28, 2021 , 23:13:43

భార‌త్ విప‌ణిలోకి ట్ర‌యంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్‌

భార‌త్ విప‌ణిలోకి ట్ర‌యంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్‌

న్యూఢిల్లీ: ‌విలాస‌వంత‌మైన బైక్‌ల త‌యారీ సంస్థ ట్ర‌యంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా దేశీయ విప‌ణిలోకి ట్ర‌యంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ మోడ‌ల్ బైక్‌ను ఆవిష్క‌రించింది. గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన కొన్ని రోజుల్లోనే ట్ర‌యంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ మోడ‌ల్‌ను దేశీయంగా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. దీని ధ‌ర రూ.16.95 ల‌క్స‌లుగా నిర్ణ‌యించారు. 2021లో ట్ర‌యంఫ్ విడుద‌ల చేసిన తొలి మోటారు బైక్ ఇదే. 

1160 సీసీ ట్రిపుల్ సిలిండ‌ర్ ఇంజిన్‌.. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌, బై డైరెక్ష‌న‌ల్ క్విక్ సిఫ్ట‌ర్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌తో న్యూ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ బైక్ రూపుదిద్దుకున్న‌ది. 10,750 ఆర్పీఎం వ‌ద్ద 178 బీహెచ్పీ, 9000 ఆర్పీఎం వ‌ద్ద 125 ఎన్ఎం పీక్ టార్చ్ సామ‌ర్థ్యం దీని సొంతం. ఇంత‌కుముందు 10 కిలోల త‌క్కువ‌గా ఉండ‌టంతో కాస్ట్‌-అల్యూమినియం ఫ్రేమ్ క‌లిగి ఉంది.

ఒహ్లిన్స్ టీటీఎక్స్ 36 ట్విన్ ట్యూబ్ మోనోషాక్‌, అడ్జ‌స్ట‌బుల్ ఫ‌ర్ ప్రిలోడ్‌, రీబౌండ్‌, కంప్రెష‌న్ డాంపింగ్‌, 270 ఎంఎం డిస్క్‌తో బ్రెంబో ట్విన్ పిస్ట‌న్ కాలిప‌ర్‌, బ్రెంబో స్టైల్మా రేడియ‌ల్ మోనోబ్లాక్ ఫ్రంట్ కాలిపర్స్‌తోపాటు ఫ్రంట్ ఎండ్ ట్విన్ 320 ఎంఎం డిస్క్‌లు త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo