శుక్రవారం 05 జూన్ 2020
Business - May 18, 2020 , 23:51:11

మారుతి 800 విద్యుత్‌ కారు!

మారుతి 800 విద్యుత్‌ కారు!

న్యూఢిల్లీ, మే 18: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ తన ఐకానిక్‌ కారైన 800ని విద్యుత్‌తో నడిచే వాహనంగా తీర్చిదిద్దుతున్నది. ఈ మోడల్‌ను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నది. ఈ చిన్న కారు మూడు దశాబ్దాలకు పైగా దేశీయ వినియోగదారుల అభిమాన్ని చూరగొన్న విషయం తెలిసిందే. హిందుస్థాన్‌ అంబాసిడర్‌ తర్వాత ఎక్కువ కాలం మార్కెట్లో ప్రజాదరణ పొందిన ఈ మోడల్‌ కార్లు 27 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. పాత 800 మోడల్‌తో పోలిస్తే ఈవీ కారును మరింత అందంగా డిజైన్‌ చేస్తున్నది. మారుతి ఎలక్ట్రిక్‌ కార్లలో తొలుత 800 మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.


logo