RS5 Sportback launched | ఆడి ఇండియా తన 2021 ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ కారును సోమవారం విపణిలో ఆవిష్కరించింది. 2.9 లీటర్ల సామర్థ్యం గల ట్విన్ టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్‌తో 444 బీహెచ్పీ, 600 ఎన్ఎం టార్చి సామ్థర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. సీబీయూ రూట్లో దేశీయ విపణిలోకి అడుగు పెట్టిన ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్ కారు ప్రారంభ ధర రూ.1.04 కోట్లు. రోడ్ సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ)తోపాటు ఐదేండ్ల కాంప్లిమెంటరీ వారంటీ కల్పిస్తోంది.
8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కెపాసిటీ గల ఈ కారు కేవలం 3.9 సెకన్లలో 100 కి.మీ. స్పీడందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించ శక్తి దీని సొంతం. పాత మోడల్ ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ కారు టూ డోర్ కూప్తో అందుబాటులో ఉంటే.. తాజా వర్షన్ కారు ఫోర్-డోర్ స్పోర్ట్ బ్యాక్‌తో ముందుకు వచ్చింది.
19 అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్ టిప్స్, స్పాయిలర్, స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మ్యాట్రిక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, హానీ కాంబ్ ఇన్సర్ట్స్ ఆర్ఎస్-స్పెసిఫిక్ గ్రిల్లే తదితర ఫీచర్లు జోడించారు. ఇంటిరియర్గా 10.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్, ఆల్కంటారా అప్‌హోలెస్టరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.