బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 24, 2020 , 23:48:56

బ్రెజ్జాలో పెట్రోల్‌ వెర్షన్‌

బ్రెజ్జాలో పెట్రోల్‌ వెర్షన్‌
  • ప్రారంభ ధర రూ.7.34 లక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన విటారా బ్రెజ్జాల్లో పెట్రోల్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.   ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.7.34 లక్షలు మొదలుకొని రూ.11.40 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నది. 1.5 లీటర్ల కే-సిరీస్‌ ఇంజిన్‌తో తయారైన ఈ కారులో 5- స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడళ్లను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంటుంది. ఈ నెల మొదట్లో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ కారును సంస్థ ప్రదర్శించిన విషయం తెలిసిందే.  


logo
>>>>>>