బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 29, 2020 , 16:25:51

కరోనా ఎఫెక్ట్‌.. ఆటో షో రద్దు

కరోనా ఎఫెక్ట్‌.. ఆటో షో రద్దు

జెనీవా :కరోనా వైరస్‌(కోవిడ్‌-19) అన్ని ఖండాలకూ విస్తరించడంతో ప్రపంచ దేశాలన్నీ  ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతుచిక్కని వైరస్‌ వ్యాప్తితో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో జరగాల్సిన సదస్సులు, క్రీడాపోటీలు, అంతర్జాతీయ ఈవెంట్లను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేస్తున్నాయి.  కరోనా వైరస్‌ వ్యాప్తితో పలు దేశాల్లో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో-2020 రద్దు  చేశారు.

స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఆదేశాల మేరకు 90వ షోను రద్దు చేశామని జెనీవా ఇంటర్నేషనల్‌ మోటార్‌ షో నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.   ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండేందుకు మార్చి 15 వరకు  1,000 లేదా అంతకుమించిన  జనసమూహాలతో పబ్లిక్‌ ఈవెంట్లను నిర్వహించకుండా నిషేధం విధించింది. మహమ్మారి దెబ్బకు   ప్రముఖ వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే షోలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి.   ఇప్పటికే 15కు పైగా కరోనా కేసులను గుర్తించినట్లు స్విస్‌ ప్రభుత్వం పేర్కొంది. 


logo
>>>>>>