ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ దక్షిణాఫ్రికా జట్టులోకి వస్తాడన్న అంచనాలకు ఫుల్స్టాప్ పడింది. అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయకూడదని ఏబీ నిర్ణయించుకున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయమే ఫైనల్ అని, సఫారీ జట్టు తరఫున మళ్లీ ఆడే ఉద్దేశం లేదని తమతో చెప్పాడని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) మంగళవారం ప్రకటించింది. దీంతో రానున్న వెస్టిండీస్ పర్యటనకు అతడిని ఎంపిక చేయలేదు. డివిలియర్స్‌తో చర్చలు ముగిశాయి. రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చే ఆలోచన లేదని అతడు చెప్పాడు. అతడి రిటైర్మెంట్ అలాగే ఉంటుంది అని సీఎస్ఏ ప్రకటించింది. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడి కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉండగానే 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి డివిలియర్స్ ఆశ్చర్యపరిచాడు.