శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Business - Aug 08, 2020 , 02:04:25

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణాలు చౌక

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణాలు చౌక

  • ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన రుణ గ్రహీతలకు ఊరట కల్పించింది. ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానం చేసుకున్న రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తాజా తగ్గింపుతో ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై రేటు 7 శాతానికి, నెలపై 7.05 శాతానికి తగ్గించింది. అలాగే అత్యధికంగా ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలు తీసుకున్నవారికి కూడా ఎంసీఎల్‌ఆర్‌ని 7.35 శాతానికి కుదించింది. తగ్గించిన వడ్డీరేట్లు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయని బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ని 20 బేసిస్‌పాయింట్లు కోత విధించింది. 

ఐవోబీ బేస్‌ రేటు కోత

ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ బేస్‌రేటును పది బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో రుణ రేటు 9.35 శాతానికి పరిమితమైంది. బ్యాంకునకు చెందిన అసెట్‌ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన బేస్‌ రేటు సోమవారం నుంచి వర్తిస్తాయి.


logo