బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 23, 2020 , 01:20:06

6.90%వడ్డీకే ఇంటి రుణం

6.90%వడ్డీకే  ఇంటి రుణం

  • ప్రకటించిన ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌

ముంబై, జూలై 22: దేశంలో అతిపెద్ద మార్ట్‌గేజ్‌ రుణాలు అందించే ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌)..వడ్డీరేటును మునుపెన్నడు లేని స్థాయి 6.90 శాతానికి తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. సిబిల్‌ స్కోర్‌ 700 ఆపై ఉన్నవారు నూతనంగా రూ.50 లక్షల లోపు ఇంటి రుణం తీసుకున్నవారికి మాత్రమే ఈ వడ్డీరేటు వర్తించనున్నదని తెలిపింది. రూ.50 లక్షలపై రుణం తీసుకున్నవారికి మాత్రం 7 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తున్నది సంస్థ. గృహ రుణాలపై వడ్డీరేటు చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గించడంతో నెలవారి చెల్లింపులు తగ్గుముఖం పట్టనున్నాయని, దీంతో గృహాల కొనుగోళ్లు ఊపందుకోనున్నాయని కంపెనీ ఎండీ, సీఈవో సిద్దార్థ మోహంతి తెలిపారు.  


logo