గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 23, 2020 , 01:20:16

ఎవరైనా చైర్మన్‌ కావచ్చు

ఎవరైనా చైర్మన్‌ కావచ్చు

  • మా కుటుంబానికేమీ ప్రత్యేక హక్కుల్లేవ్‌: సుప్రీం కోర్టుతో రతన్‌ టాటా

ముంబై, జూలై 22: టాటా ట్రస్టులకు లేదా టాటా సన్స్‌ గ్రూప్‌ సంస్థలకు టాటాలే సారథ్యం వహించాలన్నది ఏమీ లేదని, అలాంటి ప్రత్యేక హక్కు లు తమ కుటుంబానికీ లేవని రతన్‌ టాటా స్పష్టం చేశారు. టాటా సన్స్‌ నాయకత్వ వివాదంపై సైరస్‌ మిస్త్రీ కుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రతన్‌ టాటా కోర్టుకు పైవిధంగా బదులిచ్చారు. అర్హత ఉంటే ఎవరికైనా సారథ్య బాధ్యతలు లభిస్తాయని తేల్చిచెప్పారు. నిజానికి టాటా సన్స్‌లో తమ కుటుంబ సభ్యుల వాటాలు 3 శాతం లోపే ఉంటాయన్నారు. టాటా సన్స్‌లో మిస్త్రీలకు 18 శాతానికిపైగా వాటాలున్న సంగతి విదితమే. కానీ టాటా సన్స్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తొలగించి ఆ స్థానంలో టాటా కుటుంబయేతర వ్యక్తి ఎన్‌ చంద్రశేఖరన్‌ను రతన్‌ టాటా కూర్చోబెట్టారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే టాటా సన్స్‌ బోర్డులో దామాషా ప్రకారం ప్రాతినిథ్యాన్ని ఇప్పించాలని సుప్రీం కోర్టును సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోరుతున్నది. కాగా, టాటా ట్రస్టుల మేనేజ్‌మెంట్‌ సంస్థాగతానికి రతన్‌ టాటా ప్రణాళికలు రచిస్తున్న క్రమంలో ట్రస్టు చైర్మన్‌గా టాటాలే ఉండక్కర్లేదన్న ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. రతన్‌ టాటాకు ప్రస్తుతం 82 సంవత్సరాలు. అందుకే ట్రస్టుల నూతన వారసుల అన్వేషణలో పడ్డారు. 


logo