శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 15, 2020 , 16:06:35

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

 భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబై : నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల వైపు మళ్ళాయి. కరోనా నివారణకు త్వరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నదన్న అంచనాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. సెన్సెక్స్‌ ప్రస్తుతం 762 పాయింట్లు పెరిగి 36774 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు పుంజుకుని 10824 వద్ద ఉన్నాయి. ఈ కారణంగా ఐటీ రంగాలకు చెందిన షేర్లు జోరందుకున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 3 శాతానికి పైగా  ఎగిసింది. విప్రో టాప్‌  విన్నర్‌గా ఉండగా,ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌ఐఐటీ టెక్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, టీసీఎస్‌  షేర్లు లాభపడుతున్నాయి. రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌, టాటాస్టీల్‌, హిందాల్కో కూడా భారీ లాభాల్లో నడిచాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్‌, జీ, శ్రీసిమెంట్స్‌, నెస్లే, ఆసియన్‌ పెయింట్స్‌, ఎం అండ్‌ఎం నష్టపోతున్నాయి. నేటి లాభాలతో దేశీయ కరెన్సీ రూపాయి నిన్నటి నష్టాలనుంచి తేరుకున్నది. బుధవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే డాలరు మారకంలో ఎనిమిది పైసలు పెరిగి 75.34 వద్దకొనసాగుతున్నది. 


logo