మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 23:47:17

జూమ్‌, జియోమీట్‌కు పోటీగా ఎయిర్‌టెల్‌ బ్లూజీన్స్‌

జూమ్‌, జియోమీట్‌కు పోటీగా ఎయిర్‌టెల్‌ బ్లూజీన్స్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ఎవరూ ఇండ్ల నుంచి బయటికొచ్చే పరిస్థితులు లేకపోవడంతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో జూమ్‌, జియోమీట్‌ లాంటి వీడియో కాలింగ్‌ యాప్‌లకు పోటీగా ‘ఎయిర్‌టెల్‌ బ్లూజీన్స్‌' పేరిట తాము కూడా వీడియో కాన్ఫరెన్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ‘వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, సమాచార భద్రతకు మేము కట్టుబడి ఉన్నాం. ఎయిర్‌టెల్‌ బ్లూజీన్స్‌ అత్యంత సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌. ఒకేసారి 150 నుంచి 50 వేల మందిని మా ప్లాట్‌ఫామ్‌ సపోర్ట్‌ చేస్తుంది’ అని భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా విభాగ సీఈవో గోపాల్‌ విఠల్‌ వివరించారు.


logo