ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 13, 2020 , 13:47:42

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు ‌

 లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు ‌

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు‌ సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. పలు కంపెనీలు రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. అందుకోసమే మదుపరులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.సెన్సెక్స్‌ 366 పాయింట్లు ఎగిసి 36960 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 10863 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు స్వల్ప నష్టాల్లో నడుస్తున్నాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మ రంగ  షేర్ల లాభాలతో  సెన్సెక్స్‌  ట్రిపుల్‌ సెంచరీ లాభాలను మించి కొనసాగుతున్నది. దీంతో సెన్సెక్స్‌ ​ 37వేల మార్క్‌కు దగ్గరలో ఉన్నది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.92 వద్ద కొనసాగుతున్నది. logo