మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 11, 2020 , 12:28:07

రికార్డు స్థాయిలో పెరిగిన జొమాటో ఆదాయం

రికార్డు స్థాయిలో పెరిగిన జొమాటో ఆదాయం

ముంబై : ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ ఆర్దరింగ్ ప్లాటుఫామ్ జొమాటో 2019-20 ఆర్థిక సంవత్సర ఫలితాలను ప్రకటించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 394 మిలియన్ డాలర్ల (సుమారు రూ 2,955 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది జొమాటో ఆదాయం 192 మిలియన్ డాలర్ల (రూ 1,440 కోట్లు) తో పోల్చితే 105శాతం వృద్ధి నమోదు అయినట్లు తెలిపింది. అయితే కంపెనీ పన్ను చెల్లింపుల కంటే ముందు (ఎబిటా) 293 మిలియన్ డాలర్లు (రూ 2,197 కోట్లు) నష్టాలను చవిచూసింది.

గడిచిన ఆర్ధిక సంవత్సరంలో జొమాటో 277 మిలియన్ డాలర్లు (రూ 2,077 కోట్లు) నష్టం వచ్చింది. ఈ నష్టాలు పూర్తిస్థాయి నికర నష్టాలను ప్రతిబింబిచకపోయినా, కంపెనీ మాత్రం తమ రుణాలు తక్కువగా ఉన్నాయని, దీంతో నికర నష్టాలు కూడా దాదాపు ఎబిటా నష్టాలకు దగ్గరగా ఉంటాయని తెలిపింది. గతేడాదితో పోలిస్తే 47శాతం పెరిగినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో సంస్థ అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి "అని జోమాటో సీఈవో దీపిందర్ గోయల్ అన్నారు. 


logo