బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 15:48:14

జోరందుకున్న దేశీయ మార్కెట్లు

జోరందుకున్న దేశీయ మార్కెట్లు

ముంబై : ఐదు రోజుల పాటు వరుసగా లాభాలబయటపెట్టిన మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. ఈరోజు అందుకు భిన్నంగా ట్రేడింగ్ చివరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 346 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి కూడా 9 పైసలు తగ్గి 75.02 వద్ద ముగిసింది. నేడు తిరిగి కోలుకున్నాయి. స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. గం.9.16 సమయానికి సెన్సెక్స్ 154.05 పాయింట్లు లేదా 0.42శాతం  పెరిగి 36,483.06 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు లేదా 0.37శాతం లాభపడి 10,745.80 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.47 సమయానికి సెన్సెక్స్ 315 పాయింట్ల లాభాల్లోకి వెళ్లింది. 740 షేర్లు లాభాల్లో, 327 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

అయితే మధ్యాహ్నం సమయానికి ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ రంగాలు మినహా మిగిలిన వన్నీ లాభాల్లో ఉన్నాయి. ఫైనాన్షియల్, మెటల్ స్టాక్స్ భారీగా ఎగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్, విప్రో, టెక్ మహీంద్రా, యూపీఎల్ ఉన్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా. ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు ఐటీ దిగ్గజం టీసీఎస్ తోపాటు మొత్తం 19 కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అందుకోసమే పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. logo