శుక్రవారం 03 జూలై 2020
Business - Jun 03, 2020 , 15:28:59

తగ్గిన బంగారం ధరలు

తగ్గిన బంగారం ధరలు

ముంబై : బులియన్ మార్కెట్‌లో ఈ వారం లో తొలిసారిగా బంగారం ధరలు తగ్గాయి. మార్కెట్లో ఆల్‌టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన పసిడి ధర ఈరోజు కాస్త దిగొచ్చింది.  వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌ ,విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.50 మేర కొద్దిగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,170కి దిగొచ్చింది.  అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,070కి క్షీణించింది. ఢిల్లీ మార్కెట్‌లో ఈరోజు బంగారం మిశ్రమ ధరలు నమోదు చేసింది. మంగళవారం రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేడు రూ.550 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,150కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.50 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.45,950కి ఎగసింది.


logo