గురువారం 29 అక్టోబర్ 2020
Business - May 30, 2020 , 16:19:51

ఆర్థిక వ్యవస్థను కాపాడేది ఆ రెండు రంగాలే ...

 ఆర్థిక వ్యవస్థను కాపాడేది ఆ రెండు రంగాలే ...

ముంబై : ఇటీవల విడుదల చేసిన జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ అంశాలు బలంగా ఉన్నాయో, ఏ అంశాలు బలహీనంగా ఉన్నయో తెలిపేందుకు ఉపయోగపడుతాయి. 2019-20 సంవత్సరంలో గ్రాస్ వాల్యూ యాడెడ్‌‌ వృద్ధి వ్యవసాయ రంగంలో అధికంగా కనిపించింది. ఇది 2019-20లో 4శాతం వృద్ది ఉండగా.. ఇది 2018-19లో 2.4శాతంగా ఉంది. మైనింగ్ , క్వారీ రంగాల్లో 2018-19లో నెగిటివ్‌లోకి జారుకోగా 2019-20లో ఇది 3.1శాతానికి చేరుకుంది. ఈ రెండు రంగాలు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వ్యవసాయ రంగంపై కోవిడ్-19 ప్రభావం పడకూడదని ఆలోచించి పలు విధానపరమైన సంస్కరణలు తీసుకొచ్చింది. మైనింగ్‌లో ప్రైవేట్ రంగాలకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం వల్ల మైనింగ్ రంగంలో మరింత వృద్ధి సాధించడమే లక్ష్యమని స్పష్టం చేసింది.