సోమవారం 13 జూలై 2020
Business - May 29, 2020 , 21:30:14

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వెస్పా,ఏప్రిలియా కార్యకలాపాలు

 తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వెస్పా,ఏప్రిలియా కార్యకలాపాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వెస్పా,ఏప్రిలియా కార్యకలాపాలు పునః ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్నం, భీమవరం, రాజమండ్రి,  విజయనగరం, నెల్లూరు . తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్,  మహబూబ్‌నగర్ లలో వెస్పా ,ఏప్రిలియా డీలర్‌షిప్‌ కేంద్రాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అన్ని డీలర్‌షిప్‌ల వద్ద భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు ఆరోగ్య, పారిశుద్ధ్య మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నాయి . "నూతన వాస్తవికత ద్వారా అవకాశాలను అన్వేషించడంలో మా డీలర్లతో కలిసి మేము పనిచేస్తున్నాము,  మా వినియోగదారుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని,మేము గతంలోనే మా ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ వారెంటీని , లాక్‌డౌన్ కాలంలో ముగిసే ఉచిత వారెంటీలను పొడిగిస్తున్నామని "పియాజ్జియో ఇండియా ఛైర్మన్ అండ్ ఎండీ డియాగో గ్రాఫీ తెలిపారు. "మా డీలర్‌షిప్‌ల వద్ద అన్ని వాహనాల విక్రయాలు, సేవలకు సంబంధించిన సందేహాలను తీర్చడానికి సిబ్బంది సిద్ధమయ్యారు. నూతన వాహన కొనుగోలు, సేవలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని" డియాగో గ్రాఫీ పేర్కొన్నారు. తిరుపతి, విశాఖపట్నం, భీమవరం, రాజమండ్రి, విజయనగరం, నెల్లూరు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలోని అన్ని డీలర్‌షిప్‌ల వద్ద వెస్పా , ఏప్రిలియా స్కూటర్ల అమ్మకాలు , సేవలపై ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులు పొందవచ్చని" ఆయన తెలిపారు.  logo