మంగళవారం 07 జూలై 2020
Business - May 29, 2020 , 16:52:04

పసిడి ధరలు పై పైకి ...

పసిడి ధరలు పై పైకి ...
  ముంబై :  పసిడి ధరలు ఈరోజు  కాస్త పెరిగాయి. నాలుగైదు రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు హాంగ్‌కాంగ్ అంశానికి సంబంధించి అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా వైరస్ కేసులు పెరగడం వంటి వివిధ కారణాల వల్ల పైపైకి వెళ్లాయి. ఎంసీఎక్స్‌లో బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.33 శాతం అంటే రూ.152 ఎగిసి రూ.46,557 పలికింది. సిల్వర్ కిలో 0.34 శాతం అంటే రూ.167 పెరిగి రూ.48,725 పలికింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ నెల ప్రారంభంలో రూ.45,556 పలికింది. ఆ తర్వాత 15వ తేదీన రూ.47360 ఎగిసి, ఆ తర్వాత నుండి కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ రోజు రూ.46,550 కంటే పైకి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం ఎగిసి ఔన్స్ 1,719.63 పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి 1,734.60 డాలర్లు పలికింది. పల్లాడియం ఔన్స్ 1,930.67 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. వెండి ఔన్స్ 0.9 శాతం తగ్గి 830.81 డాలర్ల వద్ద, వెండి 0.3 శాతం తగ్గి ఔన్స్ 17.38 డాలర్లు పలికింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,100 వద్ద ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.44,3100 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.48,500 పలుకుతున్నది. 


 


logo