గురువారం 02 జూలై 2020
Business - May 27, 2020 , 17:19:38

డయల్-ఎ-ఫోర్డ్ సేవలు ప్రారంభించిన ఫోర్డ్ ఇండియా

డయల్-ఎ-ఫోర్డ్ సేవలు ప్రారంభించిన ఫోర్డ్ ఇండియా

ఢిల్లీ : ఫోర్డ్ ఇండియా వినూత్న సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. తన వినియోగదారులకు సురక్షిత, పరిశుభ్రమైన సేవలు అందించడానికి "డయల్-ఎ-ఫోర్డ్ " సేవలను ప్రారంభించింది.  కష్టమర్లకు ఫోర్డ్ డీలర్‌షిప్స్‌ సేవలను తమ ఇంటి వద్దకు తీసుకు వచ్చేందుకు డయల్-ఎ- ఫోర్డ్ సేవలను వినియోగించుకునేందుకు అవకాశాన్నికల్పిస్తున్నది. ఈ నూతన విధానం ద్వారా విక్రయాలు, సేవలు అందించనున్నది .   1800-419-3000 హెల్ప్‌లైన్ ద్వారా ఒకే చోటు నుంచి వీటన్నింటినీ నియంత్రించనుంది. డయల్-ఎ- ఫోర్డ్ ద్వారా వినియోగదారులు ఫోర్డ్ బృందాలను సంప్రదించేందుకు, బుకింగ్ చేసుకునేందుకు, టెస్ట్ డ్రైవ్ సేవలు అందుకునేందుకు లేదా నూతన వాహనాన్ని ఇంటి వద్ద అందుకునేందుకు అవకాశాన్నికల్పిస్తున్నది. ప్రస్తుతం వినియోగదారులకు డయల్-ఎ- ఫోర్డ్ సాంకేతికతను వినియోగించుకుని ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లే కాకుండా పికప్ , డ్రాప్ సౌకర్యాన్ని అందిస్తున్నది. వాహనం సర్వీసింగ్ , చెల్లింపుల వివరాలన్నీ ఆన్ లైన్ ద్వారా వినియోగదారులకు అందిస్తారు. ‘‘డయల్-ఎ- ఫోర్డ్ ద్వారా మేము సురక్షిత ,పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని వినియోగదారులకు సేవలందించే విషయం లో ఎక్కడా  రాజీ పడేది లేదని ’’ ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు. లాక్‌డౌన్‌లో విస్తరించిన వారెంటీ ఉత్పత్తులను అందుకునే అవకాశాన్ని కోల్పోయిన వినియోగదారులు జూన్ 30, 2020 వరకు పొందవచ్చు. ఏప్రిల్ 30 వరకు నూతన ఫోర్డ్ కార్లను బుక్ చేసుకున్న వినియోగదారులు డెలివరీ సమయంలో కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని " వినయ్ రైనా పేర్కొన్నారు. 


logo