శనివారం 30 మే 2020
Business - May 22, 2020 , 17:41:29

అగ్రి ఫై ఆర్గానిక్స్ తో సింప్లీ ఫ్రెష్ ఒప్పందం

 అగ్రి ఫై ఆర్గానిక్స్ తో సింప్లీ ఫ్రెష్ ఒప్పందం

హైదరాబాద్: ప్రముఖ అగ్రి టెక్ సంస్థ సింప్లీ ఫ్రెష్ మరో అడుగు ముందుకేసింది. సింప్లీ ఫ్రెష్  తాజా ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేర్చేందుకు సిద్ధమైంది. అందుకోసం ఈ -కామర్స్ సంస్థ  అగ్రి ఫై ఆర్గానిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నది. అగ్రి ఫై ఆర్గానిక్స్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారావినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు తమకు నచ్చిన ఉత్పత్తులను ఆర్డర్ చేయవచ్చు.  "లాక్ డౌన్ కారణంగా వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులను అందుకోలేకపోతున్నారు.  మరింత మంది కి తమ ఉత్పత్తులను అందించేందుకే  ఈ ఒప్పందం చేసుకున్నామని" సింప్లీ ఫ్రెష్ ఫౌండర్ అండ్ సిఈఓ సచిన్ దర్భార్ వార్  తెలిపారు.  సింప్లీ ఫ్రెష్ తో భాగస్వామ్యం చేసుకోవడం చాల సంతోషంగా ఉన్నది. హైడ్రో ఫోనిక్స్ విధానంలో పండించిన ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా వినియోగదారులకు అందించేందుకు వారు మాకు తోడ్పడుతున్నారని అగ్రి ఫై ఆర్గానిక్స్ కో-ఫౌండర్ ఉర్విష్ బైడి  అన్నారు.


logo