సోమవారం 01 జూన్ 2020
Business - May 20, 2020 , 00:25:36

స్నాప్‌డీల్‌ సేవలు పునఃప్రారంభం

స్నాప్‌డీల్‌ సేవలు పునఃప్రారంభం

  • -కస్టమర్లకు క్యాష్‌-ఆన్‌-డెలివరీ సదుపాయం 

ముంబై, మే 19: ఈ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ మంగళవారం దేశవ్యాప్తంగా తమ సేవలను పునఃప్రారంభించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా 26 వేలకుపైగా పిన్‌కోడ్ల పరిధిలో మళ్లీ సేవలను ప్రారంభించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. కస్టమర్లకు గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా క్యాష్‌-ఆన్‌-డెలివరీ సదుపాయాన్ని కల్పించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని కల్పిస్తున్న ఏకైక సంస్థ తమదేనని పేర్కొన్నది. దేశంలో లాక్‌డౌన్‌ మొదలైన మార్చి 25 నుంచి నిత్యావసర వస్తువులు మినహా ఇతర వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన ఆర్డర్ల స్వీకరణపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈ-కామర్స్‌ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నాలుగో విడుత లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడిగించినప్పటికీ అన్ని రకాల వస్తువుల ఆర్డర్లను స్వీకరించేందుకు అనుమతివ్వడంతో ఈ-కామర్స్‌ సేవలు మళ్లీ పూర్తిస్థాయిలో మొదలవుతున్నాయి.logo