మంగళవారం 26 మే 2020
Business - May 15, 2020 , 17:42:57

ఈ- కామర్స్ రంగం లోకి అడుగు పెట్టనున్న"పతంజలి "

  ఈ- కామర్స్ రంగం లోకి అడుగు పెట్టనున్న

 హరిద్వార్‌: లాక్ డౌన్ లో నేపథ్యంలో ప్రముఖ ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థ పతంజలి తమ ఉత్పత్తులను డోర్ డెలివరీ చేసేందుకు సిద్ధమవున్నది. అందుకోసం ఈ - కామర్స్ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. కొన్నిరోజుల్లో ‘OrderMe’ వెబ్‌సైట్ ద్వారా సరుకులు పంపిణి చేయనున్నది. ఆర్డర్ చేసిన కొన్ని గంటల్లోనే ఉచితంగా డెలివరీ చేస్తామని పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పతంజలి ఆయుర్వేద సంస్థ అనతి కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్‌ సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 


logo