బుధవారం 03 జూన్ 2020
Business - May 14, 2020 , 19:59:26

వోడాఫోన్ ఐడియా కాంటాక్ట్‌లెస్ రీఛార్జ్ సేవలు

వోడాఫోన్ ఐడియా కాంటాక్ట్‌లెస్ రీఛార్జ్ సేవలు


 ముంబై ; కస్టమర్, రిటైలర్ల మధ్య సామాజిక దూరాన్నికొనసాగిస్తూ, రిటైల్ అవుట్‌లెట్లలో కాంటాక్ట్‌లెస్ రీఛార్జిలను సులభతరం చేయడానికి వోడాఫోన్ ఐడియా  ప్రత్యేకంగా ఓ యాప్ ను ప్రవేశపెట్టింది. వొడాఫోన్ ఐడియా "స్మార్ట్ కనెక్ట్ రిటైలర్ యాప్" లో  వినియోగదారుల మొబైల్ నంబర్‌ను వాయిస్  ద్వారా ఎంటర్ చేస్టారు . తద్వారా  రీఛార్జ్ చేయవచ్చు. గూగుల్ వాయిస్ ఎనేబుల్ ఫీచర్ పది అడుగుల దూరం నుంచి ఆదేశాన్ని  గ్రహిస్తుంది.  కాంటాక్ట్‌లెస్ రీఛార్జిలను సులభతరం చేయడానికి, స్మార్ట్ కనెక్ట్ ఇప్పుడు వాయిస్ బేస్డ్ రీఛార్జ్ ఫీచర్‌తో ప్రారంభించే ఈ సౌకర్యం అన్ని వోడాఫోన్ ఐడియా సొంత స్టోర్లలో, మల్టీ-బ్రాండెడ్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నది. దేశవ్యాప్తంగా వివిధ ఆరెంజ్ , గ్రీన్ జోన్లలోని వోడాఫోన్ ఐడియా తమ స్టార్ లలో రీఛార్జ్ ప్రక్రియ ఇదే విధానం లో కొనసాగిస్తున్నది. వాయిస్ బేస్డ్ ఫీచర్ హిందీ ,ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. దశలవారీగా మరిన్ని భాషల్లో ఈ సౌకర్యం రానున్నది. 


logo