శనివారం 30 మే 2020
Business - May 14, 2020 , 13:41:52

డన్జోతో హవ్మోర్ భాగస్వామ్యం

  డన్జోతో హవ్మోర్ భాగస్వామ్యం

ముంబై:  ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ హవ్‌మోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం డన్జోతో భాగస్వామ్యం  చేసుకున్నది. ఐస్ క్రీమ్ ఉత్పత్తులను వినియోగదారులకు డోర్ డెలివరీ చేయడానికి   డన్జో డెలివరీ యాప్ లో “హవ్మోర్ ఐస్-క్రీమ్ ఎక్స్‌ప్రెస్” స్టోర్‌ అప్షన్ ను ప్రారంభించింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ , గురుగ్రామ్, హైదరాబాద్, జైపూర్, ముంబై, పూణే సహా ఎనిమిది నగరాల్లో డెలివరీ సేవలు అందించనున్నట్లు హవ్‌మోర్ తెలిపింది. ఈ యాప్ ద్వారా  వినియోగదారులు 35 రకాల హవ్మోర్ ఐస్ క్రీమ్ లను అందుకోవచ్చు. ఈ జాబితాలో   కుకీ అండ్ క్రీమ్, మామిడి మ్యాజిక్, జులూబార్, మట్కా కుల్ఫీ, నట్టి బెల్జియన్ డార్క్ చాక్లెట్, శాండ్‌విచ్ ఐస్ క్రీమ్, అమెరికన్ నట్స్, బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కేక్, అల్ఫోన్సో మామిడి, కుకీ క్రీమ్, బటర్ స్కాచ్ వంటివి ఉన్నాయి. “ ప్రస్తుత పరిస్థితుల్లో మేము వినియోగదారుల ఇళ్లకు నేరుగా చేర్చాలని భావించాం , అందుకోసమే డన్జోతో ఒప్పందం కుదుర్చుకున్నామని "హవ్మోర్ ఐస్‌క్రీమ్ ఎండి అనింద్య దత్తా పేర్కొన్నారు.   


logo