గురువారం 28 మే 2020
Business - May 13, 2020 , 07:07:49

హాట్‌కేకుల్లా తెలంగాణ బాండ్లు

హాట్‌కేకుల్లా తెలంగాణ బాండ్లు

  • రాష్ర్ట ప్రభుత్వానికి సమకూరిన మరో రూ. 2 వేల కోట్లు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు బహిరంగ మార్కెట్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరంగా అత్యంత సంక్షుభిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తెలంగాణ బాండ్లను తక్కువ వడ్డీకే కొనేందుకు ముందుకొచ్చాయి. ఈ బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రెండువేల కోట్లను సమకూర్చుకున్నట్టు తెలిసింది. తెలంగాణ బాండ్లను కొనుగోలు చేయడానికి పలు పేరున్న కంపెనీలు, ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి. గత నెలలో రెండు దఫాలుగా జరిగిన బాండ్లవేలం ద్వారా రూ. 4,000 కోట్లు సమకూరాయి. తాజాగా జరిగిన వేలంలోనూ బాండ్లకు మంచి గిరాకీ వచ్చింది. వచ్చే  ఐదేండ్ల కాలానికి బాండ్లను వేలంవేశారు. తెలంగాణ బాండ్లకు సంవత్సరానికి 5.82శాతం వడ్డీకే రుణాలివ్వడానికి ఆర్థిక సంస్థలు ముందుకురావడం విశేషం. 


logo