శుక్రవారం 05 జూన్ 2020
Business - May 09, 2020 , 15:14:24

స్విగ్గీ , జొమాటోలతో ఒప్పందం చేసుకున్నగోద్రెజ్ అగ్రోవెట్

స్విగ్గీ , జొమాటోలతో ఒప్పందం చేసుకున్నగోద్రెజ్ అగ్రోవెట్

 గోద్రెజ్ అగ్రోవెట్ సంస్థ సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. అందులోభాగంగా నిత్యావసరసాలతోపాటు, డెయిరీ ఉత్పత్తులను నిరంతరాయంగా సరఫరా చేయాలనుకుంటున్నది. అందుకోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ , జొమాటోలతో ఒప్పందం చేసుకున్నది. కరోనా మహమ్మారి నేపథ్యం లో వినియోగదారులకు నిత్యావసరాలతోపాటు, డెయిరీ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యం తో గోద్రెజ్ అగ్రోవెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటి కే లాక్ డౌన్ లేని నగరాల్లో సేవలందిస్తున్న గోద్రెజ్ అగ్రోవెట్ లాక్ డౌన్ అనంతరం మరికొన్నినగరాల్లో తన సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. గోద్రెజ్ అగ్రోవెట్ కు అనుబంధ సంస్థ గోద్రేజ్ జెర్సీ ఉత్పత్తులను కూడా ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ , జొమాటోల ద్వారా వినియోగదారులకు అందించనున్నది . 


logo