సోమవారం 01 జూన్ 2020
Business - May 06, 2020 , 17:02:12

డోర్ డెలివరీ సేవల్ని ప్రారంభించిన మారుతి

డోర్ డెలివరీ సేవల్ని ప్రారంభించిన మారుతి

 


ఢిల్లీ:లాక్ డౌన్ కారణంగా  దేశవ్యాప్తంగా మారుతితో పాటు ఇతర కార్ల తయారీ సంస్థ లు మూతపడ్డాయి. బుధవారం మారుతి సుజకి ఇండియా కు చెందిన 600 డీలర్షిప్ లను తెరిచింది. ఇప్పటికే దేశంలోని మారుతి సుజికి ఉద్యోగుల కు వర్క్ ఫ్రమ్ హోమ్ సేవలు అందిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు సేకరించి ఇంటికే వాహనాలను అందించే పనిలో పడింది మారుతి సంస్థ. లాక్ డౌన్ నేపథ్యంలో వినియోగదారులకు తగిన విధంగా సేవలందించేందుకు తాము సిద్ధమయ్యామని, గత కొన్నాళ్లుగా అందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తున్నామని మారుతి సుజికి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటికే తమ సేవలు ప్రారంభించేందుకు అన్ని రాష్ట్రాల్లో ని డీలర్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. దేశం లోని 1960 నగరాల్లో 3,080 డీలర్షిప్ లు కలిగిన ఈ సంస్థ474 అవుట్ లెట్లలో వాహనాల అమ్మకాలు ప్రారంభించింది. ఆర్డర్ చేసిన వినియోగదారుల కోసం కార్లను ఇంటికి అందించే ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ -19 నేపథ్యంలో పరిశుభ్రతను పాటిస్తూ టెస్ట్ డ్రైవ్ సౌకర్యాన్ని అందిస్తున్నది మారుతి సుజికి ఇండియా సంస్థ.


logo