శుక్రవారం 05 జూన్ 2020
Business - May 06, 2020 , 15:01:28

ఫ్లిప్ కార్ట్ సీఎఫ్ఓ గా శ్రీరామ్ వెంకటరమణ

ఫ్లిప్ కార్ట్ సీఎఫ్ఓ గా శ్రీరామ్ వెంకటరమణ


ముంబై  : ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కు కొత్త సిఎఫ్ఓ ను నియమించారు. సెప్టెంబర్ 2018 నుంచి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సిఎఫ్‌ఓ గా ఉన్నఎమిలీ మెక్‌నీల్  తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించినట్లు ఆ సంస్థ తెలిపింది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌(సీఎఫ్ఓ)గా శ్రీరామ్ వెంకటరమణను నియమించినట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.  పన్ను, రిస్క్ మేనేజ్‌మెంట్, ట్రెజరీతో సహా ఫ్లిప్‌కార్ట్, మింత్ర  వంటి కీలకమైన సంస్థల ఆర్ధిక వ్యవహారాలకు వెంకటరమణ బాధ్యత వహిస్తారు. ఫ్లిప్‌కార్ట్‌ కార్పొరేట్ అభివృద్ధికి సంబంధించిన బాధ్యతలు కూడా ఆయన నిర్వహిస్తారని, ప్రొక్యూర్‌మెంట్, ప్లానింగ్ అండ్ అనలిటిక్స్, డెసిషన్ సైన్సెస్ హెడ్‌లు ఆయనకు రిపోర్ట్ చేస్తారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో అనేక కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన శ్రీరామ్ సమర్ధవంతమైన సేవలు అందించ గలుగుతారని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.


logo