బుధవారం 27 మే 2020
Business - May 05, 2020 , 15:30:21

సూపర్ ఫండ్‌ను ఆవిష్కరించిన ఫోన్ పే

సూపర్ ఫండ్‌ను ఆవిష్కరించిన ఫోన్ పే 
  ముంబై :మదుపుదారులకు సురక్షితమైన మార్గంలో దీర్ఘకాలిక సంపదను సృష్టించడంలో సహాయపడేందుకు వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు చెందిన అనేక అగ్రశ్రేణి ఈక్విటీ, బంగారం, డెట్ ఫండ్లలో మదుపు చేసేలా సూపర్ ఫండ్స్ పేరుతొ ఒక విశిష్టమైన, సమగ్రమైన పరిష్కారాన్ని ఆవిష్కరిస్తున్నట్టు భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక  ఫోన్ పే ప్రకటించింది. దీనిని ఆవిష్కరించడం కోసం భారతదేశంలోని ప్రముఖ మదుపు నిర్వహక సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్‌ ( ఏబిఎస్ఎల్ఎమ్ఎఫ్)తో  ఫోన్ పే భాగస్వామ్యం ఏర్పరచుకున్నది. వివిధ విభాగాలు, ఆస్తి నిర్వహణ కంపెనీలకు చెందిన అగ్రశ్రేణి ఫండ్లను గుర్తించి, మదుపు చేసే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ప్లానింగ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఈ సూపర్ ఫండ్‌కు ప్రోత్సాహం అందిస్తుంది. వినియోగదారు మదుపు శైలి, రిస్క్ తీసుకునే సౌకర్యం ఆధారంగా దూకుడు, మధ్యమ, సంప్రదాయం అని- మూడు రకాల ఎంపికలను వినియోగదారులు ఎంచుకునేందుకు ఈ ఫండ్ అనుమతిస్తుంది.  ఒక మదుపుదారుగా, వినియోగదారులు తాము కోరుకునే సరైన ఫండ్‌ను నిర్ణయించుకుంటే చాలు. మిగిలిన విషయాలను ఏబిఎస్ఎల్ఎమ్ఎఫ్ కు చెందిన  ఫండ్ మేనేజర్లు చూసుకుంటారు. వాళ్లు నిరంతరం మదుపును పర్యవేక్షిస్తూ, మార్కెట్‌లో చోటు చేసుకునే మార్పులు లేదా ఫండ్ల పనితీరుకు అనుగుణంగా మార్పులు చేస్తుంటారు. వినియోగదారులకు తిరుగులేని సానుకూలతను, సౌలభ్యాన్ని అందించేలా ఒకటి లేదా మరిన్ని ఫండ్లలో మదుపు చేయడం ద్వారా దీనిని చేయవచ్చు. ఈ విశిష్టమైన పరిష్కారంలో మదుపు చేయడం కోసం, ఫోన్ పే వినియోగదారులు కొన్ని సులభమైన దశలను అనుసరించాల్సి ఉంటుంది. ఫోన్ పే యాప్ లో “నా డబ్బు” విభాగానికి వెళ్లిన తర్వాత సూపర్ ఫండ్స్ పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత వాళ్లు తమ మదుపు శైలి ఆధారంగా నచ్చిన దానిని ఎంచుకుని, ఒకసారి మదుపు ఖాతా సెటప్‌ను పూర్తి చేయడం కోసం మొత్తాన్ని ప్రవేశపెట్టాలి. వినియోగదారులు 500 రూపాయలనుంచే మదుపు చేయడం ప్రారంభించవచ్చు. అలాగే యుపిఐ ను ఉపయోగించి, తమ బ్యాంకు ఖాతానుంచే చెల్లించవచ్చు. ఈ ఆవిష్కరణ సందర్భంగా  ఫోన్ పే మ్యూచువల్ ఫండ్స్ విభాగాధిపతి టెరెన్స్ లూసియన్ మాట్లాడుతూ, “ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ భాగస్వామ్యంతో వినూత్నమైన సమగ్ర మదుపు పరిష్కారాన్ని ఆవిష్కరించడం మాకెంతో ఆనందంగా ఉందన్నారు. వెయ్యికి పైగా ఎంపికల నుంచి అగ్రశ్రేణి ఫండ్లను ఎంపిక చేసి, ఈక్విటీ, బంగారం, డెప్ట్ ఫండ్ల మధ్య సమతుల్యత సాధించే రీతిలో తేలికైన, సురక్షితమైన మార్గంతో పాటు సంక్లిష్టమైన మదుపు నిర్ణయాలలో సంపదను సృష్టించేందుకు మన 200 మిలియన్లకు పైగా వినియోగదారులకు సూపర్ ఫండ్స్ సహాయపడనుందని లూసియాన్ తెలిపారు. 


logo