శనివారం 06 జూన్ 2020
Business - May 05, 2020 , 14:49:45

ఇక నుంచి కాంటాక్ట్ ఫ్రీ పే మెంట్స్

ఇక నుంచి కాంటాక్ట్ ఫ్రీ పే మెంట్స్

 కరోనా నివారణ చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీ ఐ )మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి క్రెడిట్ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా చేసే అన్ని రకాల చెల్లింపులూ కాంటాక్ట్‌ ఫ్రీగా ఉండేలా చర్యలు చేపట్టింది . అందుకోసం పేమెంట్‌ నెట్‌వర్క్‌ కంపెనీలైన వీసా, మాస్టర్‌కార్డ్, ఎన్‌పీసీఐలకు ఆర్బీఐ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా చిప్‌ లేని డెబిట్, క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపినప్పుడు పిన్‌ ఎంటర్‌ తప్పనిసరి.. అయితే, కార్డుల్లో చిప్‌ వచ్చిన తర్వాత పరిస్థితి కొంత మారిపోయింది.. చిప్‌తో వచ్చిన కొత్త కార్డులకు కూడా రూ.2000 మించిన బిల్లులకు తప్పనిసరిగా పిన్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే, కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా చెల్లింపులన్నీ కాంటాక్ట్‌ ఫ్రీగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పేమెంట్‌ నెట్‌వర్క్‌ కంపెనీలను ఆర్బీఐ ఆదేశించింది. అంటే.. బిల్లు మొత్తం ఎంతైనా సరే మీరు కార్డును స్వైప్‌ చేస్తే చాలు.. పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరమే లేదు.. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ కు మీ కార్డు చూపితే చాలు పేమెంట్‌  చేసేయొచ్చు. పిన్‌ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. దీనివల్ల పలు సమస్యలు వస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.కార్డుల లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


logo