శనివారం 30 మే 2020
Business - May 05, 2020 , 03:07:56

హీరో మోటార్స్ ప్లాంట్లలో పనులు షురూ ...

 హీరో మోటార్స్ ప్లాంట్లలో పనులు షురూ ...


 కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటన అనంతరం మార్చి 22 నుంచి హీరో మోటార్స్ తమ ప్లాంట్లను మూసివేసింది. దీంతో హీరో మోటార్స్ కార్పొరేషన్ కంపెనీ తన ప్లాంట్లను సోమవారం నుంచి మళ్ళీ ప్రారంభించింది. కేంద్రప్రభుత్వ నిబంధనలను అనుసరించి గురుగ్రామ్, ధారుహెరా, హరిద్వార్, నీమ్ రానా ప్లాంట్లను ప్రారంభించారు. హీరో మోటార్స్ ద్విచక్రవాహనాల ఉత్పత్తి రెండు రోజుల్ ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. అత్యవసర సిబ్బంది మాత్రమే తమ కంపెనీ ప్లాంట్లకు వచ్చి సామాజిక దూరం, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనిచేస్తారని కంపెనీ తెలిపింది. మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నది.


logo