శుక్రవారం 05 జూన్ 2020
Business - May 04, 2020 , 18:54:06

నీరుగార్చిన స్టాక్ మార్కెట్లు

నీరుగార్చిన స్టాక్ మార్కెట్లు


ముంబై ; ఈ వారం ఆరంభం కూడా స్టాక్ మార్కెట్ లు నీరు కార్చాయి. లాక్‌డౌన్‌ పొడగింపు కారణంగా అమెరికా, చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్ వార్ లతో ప్రపంచమార్కెట్లు ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 1700 పాయింట్ల వద్ద పతనమవ్వగా..నష్టాల నుంచి మరింత బలహీన పడిన మార్కెట్   6 శాతం నష్టపోయింది. అయితే  ఆటో, మెటల్, బ్యాంకింగ్, రియాల్టీ వాటాలు బాగా  నష్టపో గా. నిఫ్టీ బ్యాంక్ 1791 పాయింట్లు వద్ద కుప్పకూలి 8శాతం పైగా పడిపోయి 19,744 స్థాయిలకు చేరుకోగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 7.86 శాతం తగ్గింది.  ప్రధానంగా ఆసియా ఈక్విటీలలోని భారీ అమ్మకాల ప్రభావంతో  ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మార్కెట్ క్యాపిటలైజేషన్  5 లక్షల 15వేల 309 కోట్ల రూపాయలు తగ్గి 1,24,26,311.83 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ (11 శాతం తగ్గి) ఇండెక్స్‌లో అత్యధిక నష్టాన్ని చవిచూడగా, బజాజ్ ఫైనాన్స్ (10 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (10 శాతం) ఇండస్ఇండ్ బ్యాంక్ (9.6 శాతం) భారీగా నష్టపోయాయి. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలతో టెక్ మహీంద్రా 8 శాతం, హిందూస్థాన్ యూనిలీవర్  5 శాతం క్షీణించింది.  నిఫ్టీ  ఫార్మ మాత్రమే స్వల్పంగా లాభపడింది. అలాగే కొన్ని షరతులతో మద్యం దుకాణాలను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించిన తరువాత బ్రూవరీస్ అండ్ డిస్టిలరీ కంపెనీల షేర్లు  దాదాపు 11 శాతం వరకు ర్యాలీ చేశాయి. 


logo