గురువారం 28 మే 2020
Business - Apr 26, 2020 , 15:19:25

ద్ర‌వ్య మ‌ద్ద‌తు అత్య‌వ‌స‌రం

ద్ర‌వ్య మ‌ద్ద‌తు అత్య‌వ‌స‌రం

లాక్‌డౌన్ కార‌ణంగా మూత‌ప‌డిన సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు (ఎంఎస్ఎంఈ) మ‌‌ళ్లీ య‌థావిధిగా కార్య‌క‌ర‌లాపాలు నిర్వ‌హించాలంటే వాటికి ద్ర‌వ్య‌మ‌ద్ద‌తు ఇవ్వ‌టం అత్య‌వ‌స‌ర‌మ‌ని 15వ ఆర్థిక‌సంఘం స‌ల‌హా క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. బ్యాంకుల్లో ఎగ‌వేత‌లను నివారించాలంటే ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు కూడా అవ‌స‌ర‌మ‌ని పేర్కొంది. తాజా ఆర్థిక ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఎంఎస్ఎంఈల‌కు త‌క్కువ‌స్థాయిలో రుణ‌హామీ ఇవ్వాల‌ని స‌ల‌హా క‌మిటీ సూచించింది. క‌రోనా వ‌ల్ల ఆదాయాలు ప‌డిపోవ‌టం, కొత్త‌గా వైద్య స‌దుపాయాల‌కు భారీగా ఖ‌ర్చుచేయాల్సి రావ‌టంతో రాష్ట్రాల ద్ర‌వ్య‌లోటు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని, దీనిని పూరించేందుకు కొత్త మార్గాల‌ను అన్వేషించాల‌ని సూచించింది. 


logo