గురువారం 28 మే 2020
Business - Apr 26, 2020 , 12:45:48

ఖాళీటైమ్ క‌దా.. పెండ్లిచూపుల‌పై ప‌డ్డారు

ఖాళీటైమ్ క‌దా.. పెండ్లిచూపుల‌పై ప‌డ్డారు

దేశంలో క‌రోనా లాక్‌డౌన్‌తో అనేక పారిశ్రామిక సేవ‌ల రంగాలు తీవ్రంగా న‌ష్ట‌పోగా కొన్ని రంగాలు మాత్రం అనూహ్యంగా పుంజుకున్నాయి. నెల‌రోజుల‌కుపైగా ఇంట్లోనే ఉండాల్సి రావ‌టంతో పెండ్లీడుకొచ్చిన సంతానం ఉన్న‌వాళ్లు త‌మ పిల్ల‌ల‌కు ఆన్‌లైన్‌లో పెండ్లి సంబంధాలు చూసే ప‌నిలో బిజీ అయ్యారు. దాంతో పెండ్లి సంబంధాలు కుదిర్చే ఆన్‌లైన్ కంపెనీల‌కు ఇప్పుడు చేతినిండా ప‌ని దొరుకుతున్న‌ది. 

లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత మాట్రిమోనీ వెబ్‌సైట్ల‌లో ప్రొఫైల్స్ నింపేవారి సంఖ్య 30శాతం పెరిగింద‌ని దేశంలో పెద్ద మాట్రిమోనీ సంస్థ‌లైన భార‌త్ మాట్రిమోనీ, షాదీడాట్‌కామ్ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. లాక్‌డౌన్ కార‌ణంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్న యువ‌తీయువ‌కులకు మామూలుగా స‌మ‌యంలో ఉండే ట్రాఫిక్, ప్ర‌యాణ ఇబ్బందులు లేక‌పోవ‌టంతో త‌మ రోజువారీ స‌మ‌యంలో కొంత‌వ‌ర‌కు వ్య‌క్తిగ‌త ప‌నుల‌కోసం ఉప‌యోగించుకుంటున్నార‌ని, అందులో భాగంగానే త‌మ‌కు త‌గిన వ‌రుడు, వ‌ధువును వెదుక్కొనేందుకు ప్రొఫైల్స్ నింపుతున్నార‌ని భార‌త్‌మాట్రిమోనీ  వ్య‌వ‌స్థాప‌కులు మురుగ‌వేల్ జాన‌కీరామ‌న్ తెలిపారు. 

పెండ్లి సంబంధాల‌కు సంబంధించిన ఆన్‌లైన్ కార్య‌క‌లాపాలు లాక్‌డౌన్ త‌ర్వాత ఊపందుకున్నాయ‌ని షాదీడాట్‌కామ్ సీఈవో అనుప‌మ్ మిట్ట‌ల్ తెలిపారు. వ‌ధువు లేక వ‌రుడు కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకున్న కుటుంబాల మ‌ధ్య సంప్ర‌దింపులు పెరిగాయ‌ని అన్నారు. ఒక్క వ‌ర్గ‌మ‌నే తేడా లేకుండా అన్నిస్థాయిల వాళ్లు పెండ్లి సంబంధాలు కుదుర్చుకోవ‌టంలో ఇప్పుడు క్రియాశీల‌కంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. 


logo