బుధవారం 03 జూన్ 2020
Business - Apr 25, 2020 , 18:16:27

డిస్కౌంట్‌క‌న్నా అమ్మేసుకోండి

డిస్కౌంట్‌క‌న్నా అమ్మేసుకోండి

లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. నివాసానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు కూడా కొనేవారు లేరు. దేశంలో ప్ర‌స్తుతం దాదాపు రూ.66000 కోట్ల విలువైన నిర్మాణం పూర్తి అయిన ఇండ్లు ఉన్నాయ‌ని, వాటిని డిస్కౌంట్ రేట్ల‌క‌న్నా వ‌దిలించుకోవాల‌ని ప్రాప‌ర్టీ బ్రోక‌రేజీ సంస్థ అన్‌రాక్ రియ‌ల్ సంస్థ‌ల‌కు సూచించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, పుణే, బెంగ‌ళూరు న‌గ‌రాల్లో మార్చి చివ‌రి నాటికి గృహ‌ప్ర‌వేశానికి సిద్దంగా ఉన్న ఇండ్లు 78000  ఉన్నాయ‌ని వీటి విలువ రూ.65950 కోట్ల‌ని  ఆన్‌రాక్ సంస్థ చైర్మ‌న్ అనుజ్‌పూరీ తెలిపారు. పెద్ద‌పెద్ద రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు ఇంత భారీ స్థాయిలో ఇండ్లు అమ్ముడు పోకున్నా భ‌రించ‌గ‌ల‌వ‌ని, కానీ చిన్న కంపెనీలు మాత్రం వీటిని త్వ‌ర‌గా వ‌దిలించుకొనేందుకు డిస్కౌంట్లు, ఇన్‌సెంటివ్‌లు ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు.  


logo