గురువారం 28 మే 2020
Business - Apr 23, 2020 , 18:16:05

భారీ ఉద్దీపన ప్యాకేజీ ఉండదు

భారీ ఉద్దీపన ప్యాకేజీ ఉండదు

లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పరిశ్రమలను మళ్లీ తెరిపించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారీ ప్యాకేజీ కావాలని పారిశ్రామికవర్గాలు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అమెరికా, యూరప్‌ దేశాల మాదిరిగా మనదేశంలో భారీ ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావించటంలేదని, మధ్యస్థాయి ప్యాకేజీలు రూపొందించాలని భావిస్తున్నదని ఆర్థిక మంత్రికి ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దశలో విస్తృతమైన వనరులను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. 


logo