శనివారం 06 జూన్ 2020
Business - Apr 23, 2020 , 16:21:52

వృద్ధిరేటు ఒకశాతం లోపేః సీఐఐ

వృద్ధిరేటు ఒకశాతం లోపేః సీఐఐ

కరోనాను కట్టడి చేసేందుకు నెలరోజులుగా దేశంమొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించటంతో దేశ ఆర్థిక వృద్ధి అత్యంత దయనీయంగా ఉండనుందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 0.9 నుంచి 1.5శాతం మధ్యనే ఉంటుందని సీఐఐ డైరెక్టర్ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ తెలిపారు. వ్యాపారాలన్నీ నిలిచిపోవటంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. దాంతో చాలా దశాబ్దాల తర్వాత భారత ఆర్థిక వృద్ధిరేటు 2021 ఆర్థిక సంవత్సరంలో అతితక్కువగా నమోదు కానుంది అని ఆయన విశ్లేషించారు. 


logo