బుధవారం 03 జూన్ 2020
Business - Apr 22, 2020 , 18:58:22

ఓయో ఉద్యోగులకు జీతాల్లో కోత

ఓయో ఉద్యోగులకు జీతాల్లో కోత

హోటల్‌ బుకింగ్‌సైట్‌ ఓయో తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసింది. కరోనా సంక్షోభంకంటే ముందే ఈ సంస్థ నష్టాలతో చిక్కిపోయింది. తాజాగా కరోనా కారణంగా ఆతిథ్యరంగం పూర్తిగా మూతపడటంతో సంస్థ కష్టాలు రెట్టింపు అయ్యాయి. దాంతో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఉద్యోగులందరికీ 25శాతం వేతనాలు కోత పెడుతున్నట్లు ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులను మే 4 నుంచి సెలవుపై వెళ్లాలని ఆదేశించినట్లు ఓయో ఇండియా, దక్షిణాసియా సీఈవో రోహిత్‌ కపూర్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 


logo