గురువారం 28 మే 2020
Business - Apr 21, 2020 , 23:54:21

మూడింతలైనటీజీబీ లాభం

మూడింతలైనటీజీబీ లాభం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21: తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌(టీజీబీ) ఆర్థిక ఫలితాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంక్‌ రూ.171.68 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.42.87 కోట్లతో పోలిస్తే 300 శాతానికి పైగా వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో వ్యాపారం రూ.14,762.84 కోట్ల నుంచి రూ.17,479.52 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్‌ చైర్మన్‌ వీ అర్వింద్‌ తెలిపారు. వీటిలో డిపాజిట్లు రూ.8,992.31 కోట్లు కాగా, అడ్వాన్స్‌లు రూ.8,487.12 కోట్లుగా ఉన్నాయి. గతేడాది బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.35 శాతం(రూ.165.55 కోట్లు) నుంచి 2.16 శాతానికి(రూ.182.95 కోట్లు) తగ్గిందని ఆయన చెప్పారు.  logo