బుధవారం 03 జూన్ 2020
Business - Apr 18, 2020 , 18:24:11

పని విధానం శాశ్వతంగా మారిపోతుంది

పని విధానం శాశ్వతంగా మారిపోతుంది

కరోనా సృష్టించిన సంక్షోభంతో లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ఉపాధి విధానాలు పూర్తిగా మారిపోతాయని, శాశ్వతంగా మారిపోతాయని నాస్కామ్‌ అధ్యక్షుడు దేబ్‌జానీ గోష్‌ అన్నారు. రాబోయేది మొత్తం గిగ్‌ ఎకానమీయే (శాశ్వత ఉద్యోగాల స్థానంలో తాత్కాలిక ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగటం) అని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పని ప్రదేశాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుందని తెలిపారు. భవిశ్యత్తులో పని విధానం అనే అంశంపై శనివారం పలువురు ఆర్ధికవేత్తలతో నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. దేశం ఇప్పుడు అత్యంత కఠినమైన కాలంలో పయనిస్తున్నదని అన్నారు. ఇలాంటి సవాలును ఎన్నడూ ఎదుర్కోలేదని తెలిపారు. దేశంలో సప్లైచైన్‌ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు.  ఈ సమావేశంలో పాల్గొన్న ప్రపంచబ్యాంకు భారతదేశ హెడ్‌ జునైద్‌ కమల్‌  అహ్మద్‌ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పని విధానం మార్పే కీలకం కానుందని అన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ దీర్ఘకాలం కొనసాగుతుందని, రిమోట్‌ పనివిధానం అన్నివర్గాలకు మేలుచేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని టీమ్‌లీస్‌ చైర్మన్‌ మనీష్‌ సభర్వాల్‌ అన్నారు.  


logo