శనివారం 30 మే 2020
Business - Apr 18, 2020 , 17:13:45

ఉద్యోగులు మారటోరియం వాడుకోలేదు

ఉద్యోగులు మారటోరియం వాడుకోలేదు

కరోనా లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో బ్యాంకుల్లో తీసుకున్న లోన్లపై ఆర్బీఐ మూడు నెలల మారటోరియం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సదుపాయాన్ని నెలవారీ జీతాలకు పనిచేస్తున్న ఉద్యోగులు పెద్దగా వాడుకోవటంలేదు. ఇప్పటివరకు ఉద్యోగాల తీసివేత పెద్దగా ప్రారంభం కాకపోవటంతో వేతన జీవులు తమ నెలవారీ వాయిదాలను చెల్లిస్తూనే ఉన్నారని బ్యాంకింగ్‌ వర్గాఉ తెలిపాయి. అయితే సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలవారు మాత్రం మారటోరియం సదుపాయాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. వీరిలో 85 నుంచి 90శాతం మంది మారటోరియం సదుపాయాన్ని వాడుకుంటున్నారు. వేతన జీవులు వాయిదాలను చెల్లించటానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇప్పుడు వాయిదాలు చెల్లించకపోతే భవిష్యత్తులో బ్యాంకులు ఈ వాయిదాలపై భారీగా వడ్డీలు వేసే ప్రమాదం ఉండటంతో ఎప్పటి వాయిదా అప్పుడే చెల్లిస్తున్నారు.  


logo