గురువారం 28 మే 2020
Business - Apr 17, 2020 , 17:22:20

డిస్కంల నష్టం 30 వేల కోట్లుఃసీఐఐ

డిస్కంల నష్టం 30 వేల కోట్లుఃసీఐఐ

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు డిస్కంలు రూ.30వేల కోట్లు నష్టపోయినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ తెలిపింది. అంతేకాకుండా రూ.50 కోట్ల ద్రవ్యకొరతను ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు జెన్‌కోలకు పంపిణీ సంస్థలైన డిస్కంలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.92,602 కోట్ల బకాయి ఉన్నాయని పేర్కొంది. లాక్‌డౌన్ గడువు మే 3 వరకు డిస్కంలు ఒకవైపు ద్రవ్యపరమైన ఒత్తిడి, మరోవైపు విద్యుత్‌ డిమాండ్‌ విషయంలో ఒత్తిడిని ఎదుర్కోనున్నాయని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ వివరించింది.  


logo