బుధవారం 03 జూన్ 2020
Business - Apr 15, 2020 , 20:14:19

హెల్త్ కేర్ పై పెట్టుబడులు కొనసాగించాలి

హెల్త్ కేర్ పై పెట్టుబడులు కొనసాగించాలి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ఇప్పుడు అత్యవసరంగా వైద్య సదుపాయాలపై భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి. ఈ చర్యలను ఇక ముందుకూడా కొనసాగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సూచించింది. కోవిడ్‌-19 వైరస్‌ మరోసారి విజృంభించే ప్రమాదం ఉన్నందున వైద్యసదుపాయాల కల్పన తప్పనిసరి అని ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ అన్నారు. ఇప్పుడు అన్ని దేశాల తక్షణ కర్తవ్యం ఈ సంక్షోభం నుంచి బయటపడటమేనని పేర్కొన్నారు.  


logo