శనివారం 30 మే 2020
Business - Apr 15, 2020 , 19:01:21

'దీర్ఘకాల సడలింపులు బ్యాంకులకు మంచిది కాదు'

'దీర్ఘకాల సడలింపులు బ్యాంకులకు మంచిది కాదు'

కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థలు గాడితప్పకుండా ఉండేందుకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు బ్యాంకు నిబంధనలు సడలిస్తున్నాయి. వానిజ్య బాంకుల లోన్ల రీపేమెంట్‌తోపాటు కేంద్ర బ్యాంకుల వడ్డీరేటు తగ్గింపు, లోన్ల జారీ నిబంధనల సడలింపు తదితర చర్యలు తీసుకుంటున్నాయి. మార్కెట్లో ద్రవ్యసరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఈ సడలింపులు తాత్కాలికంగానే ఉండాలని, కరోనా సంక్షోభం ముగిసిన వెంటనే వీటిని సమీక్షించాలని అంతర్జాతీయ కేంద్ర బ్యాంకుల సమాఖ్య బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్‌ (బీఐఎస్‌) సూచించింది. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించేందుకు నిబంధనల సడలింపు, ఉదార నిర్ణయాలు అవసరమే కానీ, వాటిని ఎక్కువకాలం కొనసాగిస్తే పెను ప్రమాదమని బీఐఎస్‌కు చెందిన క్లాడియో బోరియో, ఫెర్డినాండో రెస్టోవ్‌ అభిప్రాయపడ్డారు. సడలింపులు ఎక్కువకాలం కొనసాగితే బ్యాంకింగ్‌ వ్యవస్థలు బలహీనపడుతాయని తెలిపారు.  


logo