గురువారం 28 మే 2020
Business - Apr 15, 2020 , 17:19:47

చమురు ధరలు ఇప్పట్లో పెరుగవు

చమురు ధరలు ఇప్పట్లో పెరుగవు

ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయికి పడిపోయిన చమురు ధరలు ఇప్పట్లో మళ్లీ పెరిగే అవకాశం లేదని ప్రముఖ రేటింగ్‌ సంస్థ గోల్డ్‌మన్‌సాచ్‌ స్పష్టంచేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు డిమాండ్‌, సప్లైలో తీవ్రమైన వ్యత్యాసం ఉన్నందున పలు దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవటం ద్వారా స్థిరత్వం వస్తుందన్నవాదనను ఆ సంస్థ కొట్టిపారేసింది. అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆసియా పసిఫిక్‌ దేశాలతోపాటు ఇండియా కూడా వ్యూహాత్మక నిల్వలను పెంచుకొనేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాయి. అయితే ఈ దేశాలు కొనుగోళ్లు పెంచినా పడిపోయిన డిమాండ్‌ను మళ్లీ యథాస్థానానికి తేవటం రెండుమూడు వారాలపాటు సాధ్యం కాదని పేర్కొంది.

 


logo