శనివారం 06 జూన్ 2020
Business - Apr 15, 2020 , 16:38:17

నిరర్ధక ఆస్తులపై దీపక్ పరేఖ్ కీలక సూచన

నిరర్ధక ఆస్తులపై దీపక్ పరేఖ్ కీలక సూచన

బ్యాంకుల వద్ద వ్యక్తులు, సంస్థలు తీసుకున్న అప్పులను చెల్లించని పక్షంలో వాటిని నిరర్థక ఆస్తులుగా ప్రకటించే గడువును పొడిగించాలని హెచ్‌డీఎఫ్సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ ఆర్బీఐకి సూచించారు. ప్రస్తుతం వరుసగా 90రోజులపాటు రుణచెల్లింపులు చేయకుంటే వాటిని నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏ) ప్రకటిస్తున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ గడువును 180 రోజులకు పెంచాలని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు నరెడ్కో, క్రెడాయ్‌ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో  పరేఖ్‌ సూచించారు. లోన్లు వన్‌టైమ్‌ రీస్ట్రక్చరింగ్‌కు ఆర్బీఐ అనుమతివ్వాలని సూచించారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నిరర్థక ఆస్తుల నిర్ణయం విషయంలో గడువు పెంచితే రుణ సంస్థలు న్యాయపరమైన చర్యలకు దిగకుండానే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు.  


logo