సోమవారం 01 జూన్ 2020
Business - Apr 15, 2020 , 16:12:43

విస్తారాలో బలవంతపు సెలవులు

విస్తారాలో బలవంతపు సెలవులు

విస్తారా ఎయిర్‌లైన్స్‌లో సీనియర్‌ ఉద్యోగులను బలవంతపు సెలవుపై వెళ్లవలసిందిగా సంస్థ సీఈవో లెస్లీ తాంగ్‌ బుధవారం ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విమాన సర్వీసులు నిలిచిపోవటంతో ఈ నెల 15 నుంచి 30 మధ్య సీనియర్‌ ఉద్యోగులు మూడు రోజలపాటు తప్పనిసరిగా సెలవులపై వెళ్లాలని సూచించింది. ఈ సెలవు రోజులకు వేతనం ఉండదని స్పష్టంచేసింది. గత నెల 27న కూడా ఈ సంస్థ తన ఉద్యోగులకు మూడు రోజులు బలవంతపు సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కంపెనీలో ద్రవ్యసరఫరాను క్రమబద్దం చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆదేశాలతో సంస్థలోని దాదాపు 1200 మంది సీనియర్‌ గ్రేడ్‌ అధికారులు సెలవు తీసుకోనున్నారు. 


logo